Supreme Court: రిషికొండపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్‌కు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీం.. లింగమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎంను రుషికొండకు వెళ్లవద్దని అంటున్నారు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉంది.. రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించింది చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది.. హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వద్ద ఈ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేసింది.. రాజకీయ కారణాలతోనే కోర్టుకు వచ్చారన్న సీజేఐ.. లింగమనేని అభ్యర్థనను తోసిపుచ్చారు.. దీంతో, హైకోర్టుకు వెళ్తాం అన్నారు పిటిషనర్. కాగా, ఏపీ హైకోర్టు, ఎన్టీజీలో కేసు పరిష్కారం అయ్యే వరకు రుషి కొండపై ఎలాంటి నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలంటూ లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
Read Also: TSRTC: శబరిమల భక్తులకు TSRTC గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే ఉచిత ప్రయాణం!