ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖపట్నం ఆథిత్యం ఇవ్వనుంది. అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. 14వ అల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 ఈ సారి విశాఖలో జరగనున్నాయని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు.
విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.