CM YS Jagan: రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను కోల్పోయి.. ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను పదే పదే విశాఖపట్నం ప్రస్థావన ఎందుకు తీసుకొస్తానంటే.. ప్రతి రాష్ట్రానికి ఓ ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలన్నారు.. 60 ఏళ్లుగా కష్టపడి హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకున్నాం.. కానీ, దానిని కోల్పోయాం అన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయిందన్నారు. ప్రతిరాష్ట్రానికి ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి.. అందుకే నేను విశాఖ, విశాఖ అంటాను అన్నారు. రాష్ట్రం ప్రతి ఏడాది రూ.13వేల కోట్ల ఆదాయం నష్టపోతుంది అంటూ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్..
Read Also: TS EAPCET : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
ఇక, గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగింది.. ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది.. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి అన్నారు సీఎం జగన్.. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలి.. అలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది.. అందుకే వైజాగ్ గురించి పదే పదే చెబుతున్నాను అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం.. ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ప్రతీ రాష్ట్రంలో ఉండాలి అన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..