Ganta Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, మా నినాదం అని., నా రాజీనామాపై చౌకబారు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఐదేళ్లు అధికారంలో వుండి.. స్టీల్ ప్లాంట్ కోసం ఏమీ చేశారు.. గాడిదెలు కాశారా..? మేము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించాము. రాజీనామలు వల్ల ఉపయోగం లేదంటే ఆది మీ ఆవివేకం.. రాజీనామలు చేస్తే ప్రభుత్వలు కదలి వస్తాయి.. రాజీనామలు వల్ల ఉపయోగం లేకపోతే జగన్ ఎందుకు రాజీనామలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.. ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామలు చేస్తామని చేప్పారు.
Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?
రాజీనామలు గురించి మాట్లడే వారు చరిత్ర తెలుసుకోని మాట్లాడాలి. వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగినా, ప్రైవేటీకరణ జరగబోదని స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో ప్రకటించినా అది టీడీపీ వల్లే సాధ్యపడింది. స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, గుండె చప్పుడు. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై 3 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసింది.
Bandlaguda Jagir: ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన బండ్లగూడ గణేష్ లడ్డూ..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకు ఉండే ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాజీనామా విషయమై కోర్టుకు వెళ్లానే తప్ప, కేవలం రెండు నెలల గడువున్న పదవి కోసం కాదు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఇప్పుడు వచ్చిన 11 స్థానాల్లో ఒకట్లు పోయి వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా మాత్రమే మిగులుతుంది.