ఏపీలో ఐటీ అభివృద్ధిపై రేపు సమగ్రవివరాలు అందచేస్తాం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రేపు సీఎం జగన్ నర్సీపట్నం లో రెండు కీలక ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో భాగంగా అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు జరుగుతోంది. విశాఖ..తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు మేలు చేకూర్చే తాండవ..ఏలేరు ఎత్తిపోతల పథకం కి శంఖు స్థాపన జరగనుంది. ఏపీ విభజన చట్టం హామీలు అమలుపై బిజెపి నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఏపీకి మీరు చేసిన మేలు గురించి చెప్పండి. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎంపికై తెగిన గాలిపటం మాదిరిగా విశాఖ వచ్చారు. ఇక్కడ కనీసం అవగాన లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ లిఖిత పూర్వకంగా విశాఖ నుంచి సేవలు ఇస్తామని లేఖ ఇస్తే అది కూడా తప్పని చెబుతున్నారు. ఏపీ విభజన చట్టం ద్వారా రావాల్సిన హామీలపై బీజేపీ నాయకులు స్పందించడం లేదు ఎందుకన్నారు. పైరవీలు చేసుకుని పదవులు పొందిన జీవీఎల్ ఎప్పుడైనా సర్పంచ్ గా గెలిచారా? ఇన్ఫోసిస్ ఇచ్చిన లేఖలు అబద్ధాలు చెబుతాయా ?
Read Also: Revanth Reddy : ‘కల్వకుంట్ల రాజ్యంలో మాయమైపోయిన తెలంగాణం’
బీజేపీ నాయకులు ఢిల్లీలో చేయాల్సిన పనులు మానేసి విమర్శలు చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై బిజెపి వైఖరి చెప్పాలి. ఐటీకి పునాది వేసింది రాజశేఖర్ రెడ్డి …..ఇప్పుడు ఇంకా అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐటి లో తెలంగాణాలక్షా 14 కోట్ల టర్నోవర్ చేస్తే మెరైన్ లో లక్షా 19 బిలియన్ కోట్లు ఏపీ చేస్తోందన్నారు మంత్రి అమర్నాథ్. రేపు ఏపీ లో ఇంత వరకు చేసిన ఐటిలో అభివృద్ధిపై సమగ్ర వివరాలు ఇస్తాం అన్నారు మంత్రి అమర్నాథ్.
Read Also: Corona BF7: ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తేనే ఎంట్రీ.. లేదంటే ఎయిర్ పోర్టులోనే బ్రేక్