ఏపీలో విశాఖ స్టీల్ పై కేంద్రం వైఖరిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే లిఖిత పూర్వక సమాధానం అందించారు. 2021 జనవరి 27 వ తేదీన జరిగిన “ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ” ( సిసిఈఏ) సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో 100 శాతం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే, సంయుక్త రంగం, అనుబంధ రంగాల్లోని “విశాఖ స్టీల్” వాటాల ఉపసంహరణకు కూడా సిసిఈఏ ఆమోదం తెలిపింది.
Read Also: Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్
ప్రభుత్వం తీసుకున్న వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని పునః సమీక్షించే ప్రతిపాదన ఏమీ లేదు. విశాఖ స్టీల్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. “విశాఖ స్టీల్” యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని సమాధానంలో పేర్కొన్నారు మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే.
Read Also: INDvsAUS : నాలుగో టెస్ట్ డ్రా.. సీరిస్ కైవసం చేసుకున్న భారత్