బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన.. మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానినిగా పరిపాలన సాగుతుందన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం అన్నారు.
విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి చర్చ సాగుతోంది.. విశాఖలోనే కాపురం పెడతా.. అక్కడి నుంచి పాలన సాగిస్తామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత.. విపక్షాలు దానిపై కౌంటర్ ఎటాక్ చేశాయి.. అయితే, ఆ వ్యాఖ్యలు తిప్పుకొడుతూనే.. రాజధాని వైజాగే అని స్పష్టం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అక్కడి నుండే పాలన సాగనుంది అన్నారు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్ డే..…