ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన జరుగుతుంది..సీఎం జగన్ రాకను ఎవరు అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం పరిపాలనను ఎక్కడ నుంచి అయినా నిర్వహించవచ్చు. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సీఎం జగన్ వైజాగ్ సెప్టెంబర్ లో కూడా రారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Food Poisoning: “కల్తీ చాట్ మసాలా”.. 80 మందికి ఫుడ్ పాయిజనింగ్..
వచ్చే నెల మూడో తేదీన భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారా? ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: SCO Foreign Ministers Meeting: వచ్చే నెలలో భారత్ రానున్న పాక్ మంత్రి.. 2014 తర్వాత ఇదే మొదటిసారి..