Vizag Capital: మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన.. మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానినిగా పరిపాలన సాగుతుందన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం అన్నారు. అమరావతిని శాసనరాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక, రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం జగన్.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టో చదివి వినిపించారు వైసీపీ అధినేత.
ఇక, వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వస్తే.. రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం జగన్.. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం).. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తప్ప మరొకటి లేదన్నారు.. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగుతాయని స్పష్టం చేశారు.. వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి ఎనిమిది విడతల్లో రూ. లక్షా 50 వేలకు పెంచుతాం.. అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంచుతాం.. నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచనున్నట్టు వెల్లడించారు. వైస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేస్తామన్న సీఎం.. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణాలు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు.
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఇక, ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు పెంచుతాం.. వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం అన్నారు సీఎం జగన్.. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.. చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తాం అన్నారు. లా నేస్తం కొనసాగింపు, అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాలు కొనసాగుతాయని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!