తమిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు…
గతంలో బాలా రూపొందించిన వాడు-వీడు సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్…
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది.…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, నట నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ మూవీ తీస్తున్నాడు. Read…
తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ను తాజాగా తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ “విశాల్ 31”కు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ…
కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతున్నందున చిత్రసీమ తిరిగి పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది సౌత్ స్టార్స్ షూటింగ్ ప్రారంభించారు. తాజాగా తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని నెలల ముందే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయిన విషయం తెల్సిందే. తాజాగా…
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాలిని రవి, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వం వహించగా… ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” టీజర్ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఇది కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా జూన్…
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాతపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. విశాల్ ప్రస్తుతం ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో తమ చిత్రాలను సొంత బ్యానర్ పై నిర్మించే అతికొద్ది మంది నటులలో విశాల్ ఒకరు. చాలా అరుదుగా మాత్రమే విశాల్ తన చిత్రాలను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాకుండా ఇతర బ్యానర్లలో చేస్తాడు. ఇక విషయానికొస్తే… 2018లో “ఇరుంబుథిరయ్” (తెలుగులో అభిమన్యుడు)…
తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విశాల్. నూతన దర్శకుడు శరవణన్ దర్శకుడిగా ‘విశాల్ 31’ చిత్రం రూపొందుతోంది. విశాల్ సరసన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. యువ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఈ సోసియో-థ్రిల్లర్ లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్లో…
ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీ డి.ఎం.కెను విజయపథంలో నడిపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను, ఎమ్మెల్లేగా గెలిచిన స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ ను నటులు విశాల్, అమర్ అభినందించారు. రాష్ట్ర సంక్షేమంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూత నివ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.