తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విశాల్. నూతన దర్శకుడు శరవణన్ దర్శకుడిగా ‘విశాల్ 31’ చిత్రం రూపొందుతోంది. విశాల్ సరసన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. యువ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఈ సోసియో-థ్రిల్లర్ లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్లో రవీనా రవితో విశాల్ తీసుకున్న సెల్ఫీని తాజాగా పోస్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. మరోవైపు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’లో ఆర్యతో కలిసి నటిస్తున్నారు విశాల్. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, ప్రకాష్ రాజ్, మృణాలిని రవి కూడా నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్య ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.