‘ఎనిమీ’కి గుమ్మడి కాయ కొట్టేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో బాలా రూపొందించిన వాడు-వీడు సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాళిని రవి ‘ఎనిమీ’లో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.
Read Also : “రాపో19” కోసం పవర్ ఫుల్ విలన్ ?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
సోమవారం ‘ఎనిమీ’ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేశారు. ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేయారు. షూటింగ్ స్పాట్ లో టీమ్ తో దిగిన సెల్ఫీని విశాల్ పోస్ట్ చేస్తూ, లవ్లీ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని, త్వరలో టీజర్ విడుదల కాబోతోందని అన్నాడు. విశాల్ నటించిన ‘చక్ర’ సినిమా ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైంది కానీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేకపోయింది. అలానే ఆర్య నటించిన ‘టెడ్డీ’ చిత్రం మార్చిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ చిత్రానికీ పెద్దంత స్పందన లభించలేదు. దాంతో వీరిద్దరి అభిమానులు ఇప్పుడు ‘ఎనిమీ’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మల్టీస్టారర్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..