తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ను తాజాగా తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ “విశాల్ 31”కు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ సంగీత దర్శకుడు.
Also Read : “ఆర్ఆర్ఆర్” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ ?
తాజాగా ఈ చిత్రంలోని కీలక మాస్ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన బిహైండ్ ది సీన్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఇందులో విలన్స్ హీరో విశాల్ ను సీసాలతో అటాక్ చేస్తున్నారు. అందులో ఒకరు విసిరిన సీసా విశాల్ కంటికి తగిలింది. అది షూటింగ్ లో భాగం కాకుండా నిజంగానే విశాల్ కంటికి తగిలినట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.