అచ్చ తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది అతను నటించిన ‘చక్ర’, ‘ఎనిమి’ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘సామాన్యుడు’ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది. దీనితో పాటు తన ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్ గా ‘డిటెక్టివ్ -2’ తీస్తూ, ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు విశాల్. అలానే ఎ.…
యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతోంది ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. నిజానికి ఈ…
దీపావళి పండగ సందర్భంగా విశాల్ ‘ఎనిమీ’ విడుదలైంది. రజనీకాంత్ ‘పెద్దన్న’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు విశాల్. రజనీకాంత్ సినిమా తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ బాగాలేకపోడంతో విశాల్ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. విశాల్ సినిమాకు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘ఎనిమీ’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. రజనీ ‘పెద్దన్న’ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా…
దాదాపు పదేళ్ళ క్రితం విశాల్, ఆర్య హీరోలుగా దర్శకుడు బాలా ‘అవన్ – ఇవన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటుడిగా విశాల్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఇంతకాలానికి మళ్ళీ వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ చిత్రాన్ని రూపొందించాడు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చిన రజనీకాంత్ ‘పెద్దన్న’తో పోటీ పడింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పారి రాజన్ (ప్రకాశ్…
ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన…
యంగ్ హీరో విశాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 4న ఆయన నటించిన “ఎనిమీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘ఎనిమీ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమల కొండను ఎక్కారు విశాల్. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న విశాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “పునీత్ మా ఇంట్లో మనిషి…ఇన్ని రోజులైనా…
పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇండస్ట్రీలోకి వాళ్ళే కాదు అభిమానులతో పాటు అందరూ ఆయన ఇక లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో విశాల్ ఒకరు. విశాల్, పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. తాజాగా పునీత్ మృతి గురించి ఎమోషనల్ అయ్యారు విశాల్. అంతేకాదు అయన కోసం ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నారు. Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక…
యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది ‘సామాన్యుడు’. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది దీని ట్యాగ్‌లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య విశాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సామన్యుడు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా వినాయక చవితి సందర్భంగా ఈ…
విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమా దసరా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య విలన్ గా నటించిన ఈ సినిమా ‘టీజర్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ సినిమా కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో…