కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతున్నందున చిత్రసీమ తిరిగి పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది సౌత్ స్టార్స్ షూటింగ్ ప్రారంభించారు. తాజాగా తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని నెలల ముందే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయిన విషయం తెల్సిందే. తాజాగా “విశాల్31” షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్నీ విశాల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “మేము హైదరాబాద్‌లో “విశాల్ 31″ చిత్రీకరణను రీస్టార్ట్ చేశాము. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. పనిలోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది” అంటూ విశాల్ ఈ సినిమాషూటింగ్ స్పాట్ వీడియో లింక్ ను షేర్ చేశారు. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ “విశాల్ 31”కు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ సంగీత దర్శకుడు.