విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
Visakha Honey Trap Case: డబ్భులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపడానికి కూడ వెనుకాడని జాయ్ జెమీమా.. పెద్ద గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు స్కెచ్ లు వేస్తుంది. జెమిమా నెట్ వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు.
విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ) మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాలులో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్‌గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఎంత కాలం బ్రతికాం…
భీమిలి ఎర్రమట్టి దిబ్బలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో పిల్ (WP(PIL) 155/2024) దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్.. దీనిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1, జోన్-3 మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోనికి వస్తుందని పేర్కొంది..
ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాజకీయ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు.. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి.. కానీ, గిరిజనుల కృష్టాలు తీరడం లేదు.. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిలను ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే.. మరోవైపు.. కన్నుమూసినవారికి అంత్యక్రియలు నిర్వహించడానికి సొంత గ్రామానికి చేర్చాలన్నా ఆపసోపాలు తప్పడంలేదు..
Bhupathiraju Srinivasa Varma: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. విజయవాడ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రజలు ఇంకా తేరికోకముందే.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.