Dowry Harassment: వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి అయింది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిల్లీశ్వరి అనే మహిళ పెళ్లి సమయంలో 18 లక్షల రూపాయలు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అది సరిపోక వ్యాపారానికి రూ.6 లక్షలు డిమాండ్ చేయగా.. అది కూడా ఇచ్చారు. రూ. 6 లక్షలు ఇచ్చినా వేధింపులు మాత్రం తగ్గలేదు. అధిక కట్నం కోసం అత్త, భర్తల వేధింపులు భరించలేక వివాహిత డిల్లీశ్వరి ఇబ్బందులు పడింది. కట్నం కోసం భర్త, అత్త తీవ్రంగా గాయపరచడంతో తట్టుకోలేక సూపర్ వాస్మోల్ 33 తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వైద్యం చేయించకుండా పలు ఆస్పత్రులను తిప్పాడు ఆ మహిళ భర్త. చివరకు వైద్యం సరిగ్గా అందక చికిత్స పొందుతూ డిల్లీశ్వరి మృతి చెందింది. తమ కూతురు చావుకు కారణమై భర్త, అత్తమామలను శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసన