ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు..
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది.
ఆర్.ఎస్.బ్రదర్స్ విశాఖపట్నంలో అతిపెద్ద షోరూమ్‌ను జగదాంబ సెంటర్లో జనవరి 2న సగర్వంగా శుభారంభం చేసింది. సాగర తీరంలో షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ సరికొత్త షోరూమ్.. అటు సంప్రదాయ వస్త్ర ప్రియుల్ని, ఇటు అధునాతన జీవనశైలిని అభిమానించే వారిని సమానంగా ఆకర్షించే స్థాయిలో రూపుదిద్దుకోవటం విశేషం.
Rainbow Children Hospital : పిల్లల ఆరోగ్యం మరియు సంరక్షణ పట్ల పిడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమైనది. పిల్లల శస్త్రచికిత్స వైద్యులు నిర్వహించు ఈ పనితనమునకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తేదీని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నాది. ఈ ఏడాది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం వారు పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా విజయవంతంగా సవరించుకున్న 15 మందికి పైగా పిల్లలను సత్కరించింది. భారతదేశంలో…
న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు పోలీస్ కమిషనర్.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్..
వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్..
Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ…
Swallows Set of Teeth : విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో ఎలాంటి సమస్యలు…
విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్.