Heavy to Very Heavy Rains: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..
- తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు..
- రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం..
- తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ..
- అన్నమయ్య, చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy to Very Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో ట్రింకోమలీకి తూర్పు ఈశాన్యంగా 110 కిలో మీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కి.మీ.. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ… చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. తీవ్రవాయుగుండం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో కరైకల్, మహాబలిపురం మధ్య ఈ నెల 30వ తేదీ ఉదయం తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ,రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.. ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్‌యంలో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని.. కోస్తా తీరంలో మత్య్సకారులు చేపలువేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!