విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర గనుల శాఖ మంత్రి చెబుతుండగా, ప్లాంట్ ఆస్తుల విక్రయం చాపకింద నీరులా జరుగుతోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. తాజాగా, ఆర్ఐఎన్ఎల్కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు, యార్డు స్థలాలు రూ.475 కోట్లకు విక్రయించేందుకు అనుమతులు కోరారు. ఈ ఆస్తుల విక్రయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని వివరాల కోసం…
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి, రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేషన్లు మరియు జిల్లా పరిషత్‌లపై దృష్టి సాధిస్తుంది. విశాఖపట్నం లాంటి కీలక నగరాల్లో స్థానిక సంస్థలపై పట్టు సాధించిన వైఎస్ఆర్సీపీ కేడర్‌ను నిర్వీర్యం చేయాలని ప్రణాళికలు చేస్తోంది. ప్రత్యేకంగా మేయర్ పదవిని లక్ష్యంగా పెట్టి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి….
తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనే విధంగా పోలింగ్ జరిగింది.. ఇచ్చిన మాట తప్పకుండా జగన్ ఐదేళ్లు పని చేశారు.. ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.. మంచి జరిగితే ఓటు వేయాలని జగన్ కోరారు అని గుర్తుచేశారు. విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని జగన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్…
విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.
ఈనెల 5, 7వ తేదీల్లో సీఎం జగన్ (CM Jagan) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు.