రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. "శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి…
Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి…
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
విశాఖ రైల్వే జోన్కు ఏపీ ప్రభుత్వం సరికొత్తగా భూమి కేటాయించనుంది. ఈ క్రమంలో.. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు పై పురోగతి ఉంది.. సీఎంతో మాట్లాడానని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎప్పటికప్పుడు సహచర కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ…