రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. “శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి వివరించాను. పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లను అక్కడ ఆపాలని రైల్వే శాఖ మంత్రిని కోరాను. మంత్రి సానుకూలంగా స్పందించారు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కోరకు విజ్ఞప్తి చేశాం. పీఎం గతి శక్తి కింద ఇచ్చేలా ప్రాసెస్ చేస్తామని చెప్పారు.” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
READ MORE: Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారని తాను కూడా ఎదురు చూస్తున్నట్లు పవన్ కళ్యాన్ తెలిపారు. ఆర్థిక రాజధానిగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే దేశం విల విల్లాడిందన్నారు. ప్రస్తుతం సుస్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్ర ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా లాతూర్ ప్రచారంలో అక్కడి ప్రజలకు తానొక హామీ ఇచ్చినట్లు పవన్ గుర్తు చేశారు. లాతూర్ నుంచి తిరుపతికి నేరుగా ఒక ట్రైన్ కావాలని చెప్పి పోటీ చేసిన వాళ్లతో పాటు ప్రజలు అడిగారని.. ఈ అంశంపై కేంద్ర మంత్రితో ప్రస్తావించినట్లు తెలిపారు.