Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం చేస్తామన్నారు.
Read Also: CM Chandrababu: పదవులను బాధ్యతగా భావించాలి.. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం సూచన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకున్న ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉంది కానీ దానిని కాపాడుకునే బాధ్యత భారత జనతా పార్టీ తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలలో పనులు కుంటుబడ్డాయన్నారు. కూటమి ప్రభావం అధికారంలోకి వచ్చాక రెండు నెలలు నుండి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. 15 వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాబోయే రోజులు ఎన్ని వేల కోట్లయినా ఇవ్వడానికి ప్రధానమంత్రి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.