టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ప్రదర్శన సగటు క్రికెట్ అభిమాను లను నిరాశ పర్చింది. దీంతో సెమీస్‌లో స్థానం దక్కించు కోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీంఇండియా ఈసారి అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్‌పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12…
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…
t20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్‌గా రోహితే తన ఫస్ట్ ఛాయిస్ అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత విరాట్…
ప్రస్తుతం మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలకు సంబంధించిన పలు రికార్డుల గురించి మనకు తెలుసు. కానీ ధనాధన్ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారో మీకు తెలుసా? Read Also: దీపావళి అంటే చాలు.. రెచ్చిపోతున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20…
ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్‌ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా…
t20ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుపై త్వరలో జరగనున్న బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుందని ఓ అధికారి తెలిపారు. వరుస ఓటములు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, కోహ్లీని వన్డే సారథ్యం నుంచి కుడా తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వన్టేలు, టీ20లకు రోహిత్ లేదా మరెవరైనా.. టెస్టులకు కోహ్లీని సారథిగా ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోహ్లీకి…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ…
ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్ లోని సూపర్ 12 మ్యాచ్ లో నిన్న న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మేము ఈ మ్యాచ్ లో ధైర్యంగా లేము అని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు తనని అసహనానికి గురి చేసాయి అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. దాని పై కపిల్ దేవ్…
టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా…
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా..…