యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి ఇండియా నిష్క్రమించిన తర్వాత.. ఈ పొట్టి ఫార్మటు నుండి నాయకునిగా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దాంతో ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించారు. ఇలా జరుగుతుంది అని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో… విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని అఫ్రిది సూచించాడు. అయితే కోహ్లీ ఇప్పటికి వన్డే మరియు టెస్టు కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగాలనే నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులభం కాదు, ముఖ్యంగా ఇండియాకు. కాబట్టి అతను ఈ కెప్టెన్సీ భారాన్ని పూర్తిగా తన మీద నుండి తొలగించుకుంటే ఆటగాడిగా బాగా రాణిస్తాడు అని అఫ్రిది సూచించాడు.