మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో…
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్నెస్కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్…
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో తన కెప్టెన్సీ బాధ్యతలను నుండి తప్పుకోవాలనుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచింది అని బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోహ్లీ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ నుంచి తట్టుకోలేదని… అది తన సొంత నిర్ణయం అని స్పష్టం చేశాడు గంగూలీ. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలను తాను అర్ధం చేసుకున్నాను అన్నాడు. భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం…
శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో…
ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్ అనే ఛానల్కు…
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు…
టీ20 ప్రపంచ కప్ 2021 సూపర్ 12 ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు ముందు భారత్ ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను ప్రపంచ కప్ లో కూడా ఓపెనింగ్ చేస్తాను అని చెప్పాడు. దాని తగ్గట్లుగానే యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 లో…
యుఎఇలో ఈరోజు ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ గా శాస్త్రి పదవీకాలం ముగియనుంది. దాంతో తర్వాత కోచ్ బాధ్యతలు ది వాల్ రాహుల్ ద్రావిడ్ తీసుకోనున్నట్లు నినట్టి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షాతో సమావేశమై… ఈ బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ ను ఒప్పించారని వార్తలు వచ్చాయి. అయితే టీం ఇండియా తర్వాతి…
ఐపీఎల్ 2021 తర్వాత తాను రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ జట్టుకు కెప్టెన్ గా ఉండనని విరాట్ కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఎలిమినేటర్స్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూర్ కథ ముగిసింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఎందుకు కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నాను అనే విషయాన్ని కోహ్లీ ప్రకటించాడు. తాను ఈ బాధ్యతల నుండి తప్పుకోవడానికి పని భారమే…
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ కెప్టెన్ గా 2021 సీజన్ వరకు మాత్రమే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ సీజన్ అనంతరం ఐపీఎల్ టోర్నీ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అభిమానులంతా స్వాగతిస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో…