భారత టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసాడు. అయితే ఈరోజు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇక మీదట టీ20 జట్టులో కోహ్లీ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు కోసం అతను ఇప్పటివరకు ఏమి చేస్తున్నాడో అది అలాగే ఉంటుంది. అతను చాలా ముఖ్యమైనవాడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్, అతను ఆడినప్పుడల్లా ఆ మ్యాచ్ లో తనకంటూ ఒక ముద్ర వేస్తాడు. అతను జట్టు కోణం నుండి చాలా ముఖ్యమైన ఆటగాడు.
అయితే ఈ టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత… అతను మా జట్టును మరింత బలోపేతం చేయగలడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. అది మా జట్టుకు సహాయపడుతుంది అని రోహిత్ చెప్పాడు.