కెట్ మైదానంలో విరాట్ కోహ్లీని ఫుల్ ఫాంలో చూడటం కంటే మెరుగైన దృశ్యం ఏదైనా ఉందా? గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న అభిమానులు భారత మాజీ కెప్టెన్‌ను కింగ్ అంటూ అరుపులతో తమ అభిమానాన్ని చాటారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అంత ఆశాజనకంగా రాణించలేదనే చెప్పుకోవాలి. మొదట్నుంచీ అతడు నిరాశపరుస్తూనే వచ్చాడు. మధ్యలో ఓసారి అర్థశతకం సాధించాడు కానీ, అది వింటేజ్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే కాదు. మరీ నిదానంగా రాణించడంతో, క్రికెట్ ప్రియులకు అది అంత కిక్ ఇవ్వలేదు. కానీ, నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఉగ్రరూపం దాల్చాడు. ఏ కోహ్లీని అయితే క్రీడాభిమానులు చూడాలనుకున్నారో, ఆ కోహ్లీ విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల…