Virat Kohli Creates Rare Record In T20 World Cup: ఫామ్‌లోకి తిరిగొచ్చిన తర్వాత రికార్డుల తాట తీస్తున్న విరాట్ కోహ్లీ.. తాజాగా మరో అరుదైన ఘనతని తన ఖాతాలోకి వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడు చేసింది 12 పరుగులే అయినా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 22 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 80కి పైగా సగటుతో 12 అర్థశతకాల సహకారంతో 1001 పరుగులు చేశాడు. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఉంటే.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు బద్దలయ్యేది. టీ20 వరల్డ్‌కప్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన జయవర్ధనే 1016 పరుగులు చేశాడు. అంటే.. ఇంకో 15 పరుగుల దూరంలోనే కోహ్లీ ఉన్నాడన్నమాట!
కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నిరాశపర్చిన కోహ్లీ, అంతకుముందు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచెస్‌లో మాత్రం అర్థశతకాలతో అదరగొట్టాడు. పాక్‌పై 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించిన కోహ్లీతో.. నెదర్లాండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు.