మాములుగా గోడ ఎక్కాలి అంటే నిచ్చెనో లేదంటే స్టూలో వేసుకొని ఎక్కుతాం. ఉత్త చేతులతో ఎక్కాలి అంటే సాధ్యం కాదు. అందులోనే ఎలాంటి పట్టులేనటువంటి ప్లెయిన్ గోడను ఎక్కడం సాధ్యంకాని పని. అయితే ఓ చిన్నారి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూసించింది. ఇంట్లోని గోడను తన ఉత్త చేతులతో ఎక్కింది. స్పైడర్ మాదిరిగా చెకచెక పైకి పాకింది. ఆ తరువాత అక్కడ రెండు చేతులను గోడకు ఆనించి కాళ్లను గాల్లోకి ఊపింది. అనంతరం అక్కడి నుంచి కిందకు…
ఒక బండిపై ఇద్దరు ప్రయాణం చేయవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ప్రయాణం చేస్తే ఫైన్ విధిస్తారు. అయితే, ఓ వ్యక్తి తన బండిపై ముగ్గురు నలుగురు కాదు ఏకంగా 13 మందిని ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నారు. ఒక బండిపై 13 మందిని ఎలా ఎక్కించుకున్నారు అన్నది ఆశ్చర్యంగా మారింది. ఆటో కూడా కాదు టూ వీలర్. అంతమందిని బండిమీద బ్యాలెన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. చివరకు ముందు చక్రంపై కూడా పిల్లలను కూర్చోపెట్టుకొని పాటలు…
ఒక్కోసారి జరగే ప్రమాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు అలా ప్రమాదాలు జరుగుతాయో తెలియదుగాని, నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రమాదం కూడా ఒకటి. లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మలుపు దగ్గరికి రాగానే సడెన్ గా కిందపడిపోయింది. అలా కిందపడిన లారీ రెండు ముక్కలయింది. లారీ పైభాగం వేరుగా కిందపడగా కింద ఉన్న బేస్, మాత్రం అలాగే పరుగులు తీసింది. క్రిందపడిన డ్రైవర్ వెంటనే లేచి ఆ లారి కోసం పరుగులు తీశారు. ఇలాంటి…
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం ఉన్నది. మనదేశంలో కూడా ఈ గేమ్‌కు ఆదరణ ఉన్నా, దానికి తగిన మౌళిక సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో కొంత వెనకబడి ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు గల్లీగ్లలీల్లో ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు. ఒడిశాలోని సబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్లలు ఫుట్‌బాల్ గేమ్ అడుతుండగా పక్కనే ఉన్న అడవిలోనుంచి రెండు ఎలుగు…
దెయ్యం ఎలా ఉంటుంది అంటె ఫలానా అకారంలో ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అయితే, అవి ఉన్నచోట కొన్ని వస్తువులు ఆటోమాటిక్‌గా కదులుతుంటాయి. చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. దెయ్యాలను నమ్మని ఓ మహిళ లండన్‌లోని ది లాన్స్ డౌన్ అనే పబ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఓ కుర్చీలో కూర్చున్నది. టేబుల్ చుట్టూ ఉన్న మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నయి. ఎన్నట్టుండి ఎదురుగా ఉన్న కుర్చీ ముందుకు కదిలింది. దీంతో…
స్కేటింగ్ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్లు చేతులు విరిగిపోతాయి. చిన్నపిల్లలు, యువత ఎక్కువగా ఈ గేమ్‌ను అడుతుంటారు. అయితే, రష్యాకు చెందిన 73 ఏళ్ల ఇగోర్ అనే పెద్దమనిషి స్కేటింగ్ లో తన స్కిల్స్‌ను ప్రదర్శించి భళా అనిపించాడు. 73 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ఇగోర్ తన ప్రతిభను ప్రదర్శించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది. ప్రతిభకు…
ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని…
వినాయక చవితి వచ్చింది అంటే వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరుతారు. ఒక మండపంలో ఉండే గణేషుని విగ్రహ రూపం ఒకలా ఉంటే మరోక చోట మరో రూపంతో విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తన పాదాల కింద అణగదొక్కుతున్న రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు. అయితే, పంజాబ్‌లోని లూథియానాలోని గణపతి ఇప్పుడు అందర్ని అకట్టుకుంటున్నాడు. ఆ గణపతిని తయారు చేయడానికి 200 కిలోల డార్క్ చాక్లెట్‌ను వినియోగించారు. ఈ డార్క్ చాక్లెట్…
ఏ పని పూర్తి చేయడానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి. దానికి తగిన పట్టుదల, ఓర్పు, సహనం ఉండాలి. అంతకు మించి వారితో కలిసి పనిచేసే వ్యక్తులు ఉండాలి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఎలాంటి కష్టమైన పనినైనా పూర్తిచేయవచ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్‌కు చెందిన ఖైదీలు. ఇజ్రాయిల్‌లోని గిల్బోవా అనే జైలు ఉన్నది. అందులో కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఆరుగురు ఖైదీలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. వారు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం…