ఒక్కోసారి జరగే ప్రమాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు అలా ప్రమాదాలు జరుగుతాయో తెలియదుగాని, నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రమాదం కూడా ఒకటి. లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మలుపు దగ్గరికి రాగానే సడెన్ గా కిందపడిపోయింది. అలా కిందపడిన లారీ రెండు ముక్కలయింది. లారీ పైభాగం వేరుగా కిందపడగా కింద ఉన్న బేస్, మాత్రం అలాగే పరుగులు తీసింది. క్రిందపడిన డ్రైవర్ వెంటనే లేచి ఆ లారి కోసం పరుగులు తీశారు. ఇలాంటి ప్రమాదం బహుశా మరెక్కడా జరిగి ఉండదు. లారీ ప్రమాదానికి ముందు ఓ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుంచి దూసుకొచ్చిన ఆ లారీని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ లారీకి దెయ్యం పట్టిందని, అందుకే అలా జరిగిందని నెటిజన్లు చెబుతున్నారు.
Read: కాశ్మీర్ యువత కోసం శ్రీనగర్‌లో స్పెషల్ ఎయిర్‌షో…
शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc
— Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021