కాన్సెప్ట్ మోడల్‌లో వచ్చిన హోటల్స్ ఈమధ్యకాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ కాన్సెప్ట్‌తో వినియోగదారులకు ఆకర్షించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఖైదీ బిర్యానీ పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించారు. జైలు వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో ఫుడ్ సర్వ్ చేసే వారు ఖైదీ డ్రస్సులు వేసుకొని సర్వ్ చేస్తుంటారు. ఇక ఈ హోటల్‌లో సాధారణ గదులకు బదులుగా గదులను జైలు గదులుగా మార్చారు. ఈ గదులకు ముందు జైల్లో ఉన్నట్టుగానే ఊసలు ఉంటాయి. ఇలాంటి క్యాబిన్లు మొత్తం 16 ఉండగా, ఇందులో వీఐపీ క్యాబిన్ పేరుతో ఓ క్యాబిన్ ఉంది. ఈ క్యాబిన్‌లో 20 మంది కూర్చొని ఫుడ్ తీసుకొవచ్చు. వినియోగదారులను తమ రుచులతో కట్టిపడేయడమే లక్ష్యంగా జైల్ థీమ్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు చెబుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి ఖైదీ బిర్యానీని రుచి చూస్తున్నారని నిర్వహాకులు చెబుతున్నారు.
Read: Mahalinga Nayak: నీళ్ల కోసం ఏకంగా ఏడు సొరంగాలు తవ్వాడు… పద్మశ్రీ సాధించాడు..