పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సాంగ్ చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని, కానీ తాను కొంచం లేట్ అయ్యానని, కానీ ప్రయత్నం చేశానని పోస్ట్ చేసింది. పుష్ప సినిమాను చూడలేదని, సమయం దొరకలేదని, ఈ వీక్‌లోనే సినిమా చూస్తానని పోస్ట్ చేసింది. గర్భవతిగా ఉండి కూడా సాంగ్‌కు డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Read: Love Mouli: లిప్ లాక్ ఇచ్చి ప్రేయసిని పరిచయం చేసిన నవదీప్
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి