పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినపుడు రిజర్వాయర్ కింద ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నష్టపరిహారం ఇస్తుంటారు. ఏ దేశంలో తీసుకున్నా రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో గ్రామాల్లోని ప్రజలను తరలిస్తుంటారు. స్పెయిన్‌లో 1990 దశకంలో ఆల్టో లిండోసో అనే రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెరెడో గ్రామంలోని ప్రజలను తరలించారు. 1992లో తరలింపు పూర్తయింది. రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించడంతో అసెరెడో గ్రామం పూర్తిగా మునిగిపోయింది. మొన్నటివరకు రిజర్వాయర్‌లో నీరు ఉండగా, ఇటీవల ఏర్పడిన కరువు కారణంగా ఆ డ్యామ్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది.
Read: Ukraine Crisis: రష్యా రక్షణశాఖ కీలక నిర్ణయం
నీటిమట్టం తగ్గిపోవడంతో 30 ఏళ్ల తరువాత మునిగిపోయిన అసెరెడో గ్రామం బయటపడింది. ఈ గ్రామం చూసేందుకు ఘోస్ట్ విలేజ్‌గా మారింది. కట్టడాల పైకప్పులు లేకుండా మొండి గోడలతో దర్శనం ఇచ్చాయి. 30 ఏళ్ల తరువాత బయడపడిని ఈ గ్రామాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. 1992లో చివరిసారి గ్రామాన్ని చూశామని, మళ్లీ ఇంతకాలానికి అసెరెడో గ్రామాన్ని చూస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. గ్రామంలో నివశించిన వ్యక్తులు కొందరు గ్రామంలోని ఇళ్లను చూసీ కన్నీళ్లు పెట్టుకున్నారు.