Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించారు. ప్రధాని పర్యటనకు ముందు బీజేపీ ఎమ్మెల్యే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి.. ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా శనివారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
చిన్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. ఇదే విధంగా ఓ వ్యక్తి అందరికంటే భిన్నంగా ఆలోచించి ఓ ప్యాసింజర్ ఆటోను లగ్జరీ కారును తలదన్నేలా రూపుదిద్దాడు. ఇందులో AC, పవర్ విండోస్, కన్వర్టిబుల్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఆటో రిక్షా వీడియో గురించి మరింత తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని బద్నేరా…
ఒక యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ, కొంతమంది యువకులు అతని కాళ్ళను తాడుతో కట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఘుగ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘఘ్రౌవా ఖదేసర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. Also Read:Komatireddy Venkat Reddy : ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు ఘగ్రౌవాలోని…
Pakistan: ‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా…
బెంగళూరులో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. రూఫేనా అగ్రహారంలో ఓ వ్యక్తి హెల్మెట్ బదులు కడాయి పెట్టుకున్నారు. కానీ ఇది కావాలని పెట్టుకున్నడా.. లేక హెల్మెట్ లేక పెట్టుకున్నాడా అనేది.. పూర్తిగా తెలియదు. అయితే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. Read Also: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో…
Namaz In Temple: తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తిరుప్పూర్-మంగళం రోడ్డులోని సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి దేవాలయంలో గత ఆదివారం (అక్టోబర్ 26) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పూచుకాడ్ నివాసి అయిన అజ్మల్ ఖాన్ (21) అనే యువకుడు ఆలయంలోకి వచ్చి.. అక్కడ భక్తులు ఉన్నప్పటికీ,…
Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.
సాధారణంగా సొట్ట బుగ్గలున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తుంటారు. ఈ సొట్ట బుగ్గలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు నవ్వినపుడు.. చెంపలు లోపలికి వెళ్లి ఓ గుంతలా కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి సొగ్గ బుగ్గలకు సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Pea Nuts: వేరు శెనగ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా.. కొంతమందికి…
డాక్టర్లను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ఓ రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం. ఇదే విధంగా ప్రవర్తించింది ఓ లేడీ డాక్టర్. ఓ వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే.. వైద్యం చేయాల్సింది పోయి ఆ వ్యక్తిపై మహిళా వైద్యురాలు దురుసుగా ప్రవర్తించింది. ఏకంగా చెంప చెల్లుమనిపించి తన కోపాన్ని వెల్లగక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సోలా సివిల్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఇది చూసిన…