Bengaluru Auto Driver: అర్ధరాత్రి ప్రయాణం అంటే చాలా మంది మహిళలకు సహజంగానే భయంతో ఉంటారు. అయితే, బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరి హృదయాలను తాకిన ఘటన, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇక, అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, డ్రైవర్ చూపిన ఆత్మీయత వల్ల తాను పూర్తిగా భద్రంగా ఉన్నాననే భావన కలిగిందని ఓ వీడియోలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
Read Also: Fake Currency: వేములవాడలో దొంగనోట్ల కలకలం.. హాట్ టాపిక్ వ్యవహారం..
ఇక, @littlebengalurustories అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, ఆటోలో కూర్చున్న మహిళ తన అనుభవాన్ని మొత్తం రికార్డ్ చేసింది. ఇప్పుడు రాత్రి 12 గంటలు.. నేను రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్నాను.. ఇక్కడ ఇది చదివిన తర్వాత నిజంగా సేఫ్‌గా ఫీలవుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆటోలో అతికించి ఉన్న ఓ చేతిరాత నోటీసును చూపించింది.. అందులో “నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను.. మీ భద్రతే నాకు ముఖ్యం.. సౌకర్యంగా కూర్చోండి” అని రాసి ఉండటం అందరినీ ఆకట్టుకుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయతే, ఈ వీడియోకు ఇప్పటికే లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది మంది బెంగళూరు వాసులు స్పందిస్తూ.. ఇది నిజమైన “నమ్మ బెంగళూరు స్పిరిట్” అని కొనియాడుతున్నారు. “నేను 20 ఏళ్లుగా ఈ నగరాన్ని చూస్తున్నాను.. ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం” అని మరో యూజర్ వ్యాఖ్యానించగా, “వీళ్లే అసలైన బెంగళూరు ఆటో డ్రైవర్లు.. వారికి పెద్ద బాధ్యత ఉంటుంది” అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. మరో నెటిజన్ అయితే “మేడమ్, బెంగళూరులో మీరు ఎప్పుడైనా సేఫ్.. లోకల్ వాళ్లు ఎవరినీ ఇబ్బంది పెట్టరు” అంటూ భరోసా కల్పించాడు.
Read Also: Messi vs Revanth Reddy: నేడు రేవంత్‌రెడ్డి vs మెస్సీ మ్యాచ్.. టైమ్, పూర్తి వివరాలు ఇవే..
కాగా, ఇది ఒక్కటే కాదు.. గత నెలలో కూడా ఓ మహిళ తన రాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అర్ధరాత్రి 38 కిలోమీటర్ల ప్రయాణంలో బైక్ చెయిన్ తెగిపోయినా, డ్రైవర్ “భయపడకండి.. బాగు చేసి ఇంటి వరకూ వదిలేస్తాను” అని చెప్పడం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొనింది. ప్రపంచంలో చెడు గురించే ఎక్కువగా వింటుంటామని, కానీ ఇలాంటి మంచి సంఘటనలే మనుషులపై, భద్రతపై, మానవత్వంపై మళ్లీ నమ్మకం కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. బెంగళూరు వీధుల్లో కనిపించే ఈ చిన్న చిన్న మానవీయ ఘటనలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.