మణిపూర్‌లో రెండు నెలలుగా జరుగుతున్న హింసాకాండ ఇంకా ఆగడం లేదు. ఈ హింసతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టాన్ని మిగిల్చింది. మరోవైపు మణిపూర్ ఎప్పటికి కోలుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మణిపూర్ లో అల్లర్లపై రాజ్యసభలో చర్చ కూడా జరిగింది. మణిపూర్ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. మణిపూర్ లో అన్ని అల్లర్లు జరుగుతున్న కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నాయి.
Sonali Bendre: ఇంద్ర హీరోయిన్ ఈ వయసులో కూడా హాట్ ట్రీట్ ఎలా ఇస్తుందో చూశారా?
మణిపూర్ లో ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిమిషాల్లోనే మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మణిపూర్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టింది. కేవలం బ్రాడ్ బ్యాండ్ సేవలు, స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ అందించే సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది.
Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు పోలీస్ శాఖ కీలక సూచనలు
అల్లర్లు జరుగుతున్న సమయంలో ఆనాడు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. దీంతోనే చాలా వరకు హింసాత్మక ఘటనలు తగ్గాయి. లేదంటే ఫోన్లలో మెస్సెజ్ ల ద్వారా ఎదుటివారి భావోద్వేగాలను సులువుగా రెచ్చగొట్టేవారు. ఇటీవల ఆంక్షలను ఎత్తివేయడంతో అల్లర్ల నాటి వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ మరోసారి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్, వైఫై సేవలను కూడా నిషేధించింది. ఒకవేళ వీటిని ఎవరైనా వినియోగించినట్లైతే.. సదరు సర్వీస్ ప్రొవైడర్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.