Rahul Gandhi: మణిపూర్‌లో జరుగుతున్న హింస దారుణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటే.. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) మౌనంగా ఉండదని అన్నారు. మణిపూర్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో పాటు ఈశాన్య రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న హింసాకాండపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ అంశంపై ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్‌లో ప్రధానమంత్రి మౌనం.. నిష్క్రియాత్మకత మణిపూర్‌ను అరాచకం వైపు నెట్టిందని.. మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇండియా మౌనంగా ఉండదన్నారు. మణిపూర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి ఒక్కటే ముందున్న మార్గమని మణిపూర్‌లో కుల హింస ఇప్పుడు ‘అరాచకం’గా మారిందని.. మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Shah Rukh Khan ICC: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో షారుఖ్ ఖాన్.. ఇక భారత్‌ను ఎవరూ ఆపలేరు!
మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాకాండ గత రెండున్నర నెలలుగా కొనసాగుతునే ఉంది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో.. జనజీవనం స్తంభించిపోయింది. సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చిన వీడియోలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి, ఉన్మాదమైన గుంపు మొత్తం గ్రామాన్ని ఊరేగించారని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరూ మహిళలు కుకీ కమ్యూనిటీకి చెందిన వారు. ఈ ఘటన తర్వాత మహిళలపై దుండగులు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే మణిపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ట్వీట్‌లో పోలీసులు తెలిపారు. ఈ ఘటన తౌబాల్ జిల్లాలోని నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ పరిధిలో మే 4, 2023న చోటుచేసుకుందనీ, మహిళలను గుర్తుతెలియని సాయుధ దుండగులు నగ్నంగా ఊరేగించారనీ, వారిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య మొదలైన వాటిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Read also: Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపైనే విపక్షాల ఫోకస్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా వీడియోపై స్పందిస్తూ.. మణిపూర్ నుండి వెలువడుతున్న మహిళలపై లైంగిక హింస చిత్రాలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయన్నారు. మహిళలపై జరిగిన ఈ దారుణమైన హింసాకాండను ఎంత ఖండించినా సరిపోదని పేర్కొన్నారు. మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం మనమంతా ఒకే గొంతుకతో ఖండించాలని ప్రియాంక గాంధీ అన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఎప్పుడూ స్పందించారు? ఆ హింసాత్మక ఘటనలు వారిని కలవరపెట్టడంలేదా? అని ప్రియాంక గాంధీ ట్వీట్టర్‌లో ప్రశ్నించారు.
PM’s silence and inaction has led Manipur into anarchy.
INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur.
We stand with the people of Manipur. Peace is the only way forward.
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023