Manipur Violence: సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్‌లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్‌లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం మణిపూర్‌లో ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న హింసకు కాంగ్రెస్సే కారణం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో హింసను సృష్టించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని బీరేన్ సింగ్ సూచించారు. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. లడఖ్‌లో ఉంటే లడఖ్ గురించే మాట్లాడాలి కానీ మణిపూర్ గురించి కాదని హితవుపలికారు. లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురిచే మాట్లాడాలి.. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
Read Also: Telangana: డాక్టర్ లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సు..అయ్యో పాపం ఎంత పనైంది..
పార్లమెంటులో ప్రధాని మోడీ, అమిత్ షాల ప్రకటనల తర్వాత మణిపూర్‌లో శాంతి నెలకొందని.. మణిపూర్ విడిచి వెళ్లిన వారు తిరిగి చేరుకుంటున్నారని.. ప్రజల పునరావాసం మరియు స్థిరనివాసం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఎన్. బీరేన్ సింగ్ గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. మణిపూర్‌లో సాధారణ స్థితిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన అమిత్ షాకు తెలియజేశారు. మణిపూర్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా సీఎంతో పాటు మణిపూర్‌కు చెందిన కొందరు మంత్రులు కూడా ఉన్నారు. “మేము హోంమంత్రి సలహా తీసుకోవడానికి ఇక్కడకు వచ్చాము” అని షాను కలవడానికి ముందు సింగ్ చెప్పారు. ఆగస్టు 29 న మణిపూర్ శాసనసభ యొక్క ఒక రోజు సమావేశానికి ముందు షా మరియు సింగ్ మధ్య సమావేశం జరిగింది.
రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా మెరుగవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.