ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
Vulture Population: భారత్‌లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
హిందావ్ పట్టిలోని భౌద్ గ్రామానికి చెందిన రుకం సింగ్ కుమార్తె తొమ్మిదేళ్ల పూనమ్.. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటుంది. తన మరో ముగ్గురు అక్కాచెళ్లె్ల్లు ఇంట్లో ఉన్నారు. ఆమె తల్లి ఉషాదేవి దేవుడి పూజ కోసం గుడికి వెళ్లింది. అయితే.. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి పూనమ్ ఇంట్లో కనిపించలేదు. పూనమ్ అక్క ప్రియాంక, తమ్ముడు ప్రిన్స్, ఆరాధ్య గదిలో నిద్రిస్తున్నారు. తల్లి చుట్టుపక్కల వెతికినా పూనమ్ కనిపించలేదు. పక్కనే ఉన్న వారు కూడా బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఇంటికి కొంత దూరంలో రోడ్డుపై పూనమ్ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి.
Pawan Kalyan- Anasuya: పవన్ తో మోత మోగించే అనసూయ ఐటెం సాంగ్?
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూనమ్ మృతదేహం ఇంటికి 30 మీటర్ల దూరంలో పొదల్లో పడి ఉంది. పూనమ్ గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నట్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. అతని తండ్రి విదేశంలో ఉంటున్నాడని.. హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే చిన్నారిని చంపిన చిరుతను పట్టుకునేందుకు గ్రామంలో బోన్లు ఏర్పాటు చేశామని, అది ఎక్కడ సంచరిస్తుందోనని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని రేంజర్ ఆశిష్ నౌటియాల్ తెలిపారు. మరోవైపు దేవప్రయాగ్‌లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు చిరుత భీభత్సానికి వ్యతిరేకంగా తహసీల్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీ సిబ్బందిని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చిరుతను పట్టుకునేందుకు నగరం చుట్టూ బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో చిరుతల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వాహనాల ఏర్పాటుతో పాటు పకడ్బందీగా ఉన్న అటవీ సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.