Cow Dung: ఆవు పేడతో కొట్టుకుంటే సరి..! పెళ్లి కాని వారికి కూడా పెళ్లి అవుతుంది..
- తమిళనాడు - కర్ణాటక సరిహద్దు గ్రామంలో ఓ నమ్మకం..
- తాళవాడి అటవీ ప్రాంతంలో గోవు పేడ ఉత్సవం..
- దీపావళి తర్వాత మూడవ రోజు ప్రతి ఏడాది పేడ ఉత్సవం..
- ఆవు పేడతో అలా కొట్టుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cow Dung: భారతీయ సంస్కృతిలో ఆవును గోమాతగా పూజిస్తారు.. ఇక, గోవు నుంచి లభించే పాలకే కాదు.. గోమూత్రానికి, గోవు పేడకు కూడా కొన్ని అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు.. ఆవు పేడను ఎరువుగా, బయోగ్యాస్ తయారీకి, నిర్మాణ సామగ్రిగా మరియు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. దీనికి దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉంది, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం మరియు ఇంధన అవసరాల కోసం ఆవు పేడ బాగా ఉపయోగ పడుతుంది.. అయితే, తమిళనాడులోని ఓ గ్రామంలో ఆవు పేడతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.. ఆ పేడను ఓ దగ్గర వేసి.. వాటిని పెద్ద ఉండలాగా తయారు చేసి.. కొట్టుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది..
Read Also: Bus Fire Accident: పూర్తి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సు.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
తమిళనాడు – కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోని తాళవాడి అటవీ ప్రాంతంలో జరిగే ఒక విశేషమైన సంప్రదాయ ఉత్సవం ఇది.. దీపావళి తర్వాత మూడవ రోజు ప్రతి సంవత్సరం.. ఆవు పేడతో కొట్టుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు స్థానికులు.. దీంతో, ప్రతీ ఏడాది దీనిని నిష్టగా పాటిస్తారు.. దీనివల్ల పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, పిల్లలకు మంచి విద్యాబుద్దులు వస్తాయని.. అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకం ఉండడంతో.. గ్రామంలో సేకరించిన ఆవు పేడను ఓ దగ్గర పోసి.. గ్రామస్తులు, యువకులు, పిల్లలు.. దాని చుట్టూ చేరి.. చేతులతో ముద్దలుగా చేసి.. ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు.. ఆవు పేడతో అలా కొట్టుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఓ ఉత్సవంగా దీనిని నిర్వహిస్తున్నారు ఆ గ్రామస్తులు..
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!