UP Video: సాధువుల వేషంలో చోరీలు.. నలుగురికి దేహశుద్ధి
- సాధువుల వేషంలో చోరీలు
- నలుగురికి దేహశుద్ధి.. లక్నోలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధువుల వేషంలో దర్జాగా చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారికి స్థానికులు బడిత పూజ చేశారు. కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధువుల వేషధారణలో నలుగురు వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా ప్రజల నుంచి విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్తున్నారు. వరుసగా వస్తువులు, నగదు చోరీకి గురి కావడంతో యువకులు నిఘా పెట్టారు. నలుగురు సాధువుల వేషధారణలో చోరీలకు పాల్పడడాన్ని గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారికి బడిత పూజ చేశారు. అనంతరం నలుగురు నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. తమను క్షమించాలని… తాము నిర్దోషులమని వేడుకున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం ఉదయం సాధువుల వేషంలో ఉన్న పురుషులు మహురకలా గ్రామంలోని ఒక దుకాణం దగ్గరకు వెళ్లారు. దుకాణదారుడితో సంభాసిస్తూ అతనిపై తిలకం వేసి మత్తు ప్రసాదం తినిపించి రూ.1,100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుకాణదారుడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత దుకాణంలోంచి మూడు బస్తాల ఆవాలు, నగదును దొంగిలించి పారిపోయారు. శనివారం ఉదయం ఆ నలుగురు గంగాఖేడా చేరుకున్నారు. అక్కడ స్థానికులు వారిని గుర్తించారు. స్పృహలోకి వచ్చిన దుకాణదారుడు వారిని గుర్తించడంతో గ్రామస్తులు చితకాబాదారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మీరట్‌లోని సంసాపూర్ గ్రామ నివాసితులైన ఆకాష్, అక్షయ్, రాకేష్, అమిత్‌లుగా గుర్తించారు. రుద్రాక్ష లేదా ప్రసాదం అందజేసి ప్రజలను మోసం చేసే పద్ధతి వీరిదని విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
लखनऊ पुलिस की जांच में पता चला-
ये कोई साधु नहीं हैं, सपेरे हैं। लेकिन अब वो भी नहीं हैं। सिर्फ सम्मोहित करके ठगी करते हैं। चारों युवक अमित, आकाश, सागर और अक्षय हैं। मेरठ के रहने वाले हैं। इन्हें गिरफ्तार करके मुकदमा दर्ज किया जा रहा है।
pic.twitter.com/L2yuYugLZw— Sachin Gupta (@SachinGuptaUP) August 10, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు