చంద్రయాన్-3 మిషన్‌కు రేపు ముఖ్యమైన రోజు.. చంద్రునిపై 14 రోజుల రాత్రి రేపటితో ముగియనుంది. చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుండి బయటకు రాబోతున్నాయి. 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్న తర్వాత.. ల్యాండర్, రోవర్‌లను ఇస్రో శుక్రవారం (సెప్టెంబర్ 22) యాక్టివేట్ చేయనుంది.
Chandrayaan 3 Mission: చంద్రుడిని దానిపై ఉన్న వస్తువులను 3D రూపంలో (మూడు కొలతలు) చూడటానికి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ప్రత్యేక 'అనాగ్లిఫ్' పద్ధతిని అవలంబించారు.
Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 విజయవంతమైన చాలా రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ మరో ఘనత సాధించింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది
Pragyan Rover Click the Photo of Vikram Lander: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. ఇక చంద్రుడిపై అడుపెట్టినప్పటి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది. Also Read: David Warner: ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్..…
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్‌లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 సురక్షితంగా జాబిల్లిపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల అనంతరం రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం.
Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ 'విక్రమ్' నుంచి బయటకు వచ్చింది.