Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండవ్వడం భారత సాంకేతిక సత్తాకు దర్పణం పట్టింది.
విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి ఫొటోలను ఇస్రో కేంద్రానికి పంపింది. ఈ ఫొటోలను ఇస్రో తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకుంది. చంద్రుడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రుడి ఉపరితలం ఫొటోలపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. చంద్రుడి ఉపరితలాన్ని క్రికెట్ పిచ్‌గా ఊహించుకున్న జాఫర్.. మొదట బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది అని పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక సీమర్, ముగ్గురు ఆల్‌రౌండర్‌లతో బరిలోకి దిగుతా’ అని జాఫర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read:
‘భారతదేశానికి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన చారిత్రక క్షణాలకు డబ్లిన్ నుంచి సాక్షులుగా నిలిచాం’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా భారత్ పేరు వినేందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ఇది గర్వపడే క్షణం. ఇస్రో కష్టానికి అభినందనలు’ అని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ‘చంద్రయాన్ 3 బృందానికి అభినందనలు. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్ అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.
Definitely a bat first surface. I'd go with 3 spinners, one genuine seamer along with an all rounder 😛😉
📸: Chandrayaan3 #Chandrayaan3Landing pic.twitter.com/mkmk5h9AW5— Wasim Jaffer (@WasimJaffer14) August 23, 2023
🎥 Witnessing History from Dublin! 🙌
The moment India's Vikram Lander touched down successfully on the Moon's South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!