భారతదేశం తన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌తో ఈరోజు చంద్రునిపై కలలకు దగ్గరగా చేరుకుంది. వచ్చే బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌కు ముందు కీలకమైన విన్యాసాన్ని ప్రదర్శించింది. చంద్రయాన్ మిషన్ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తోంది. గురువారం చంద్రయాన్-3 మిషన్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా వేరు చేయబడిన సంగతి తెలిసిందే.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. Chandrayaan 3, breaking news, latest news, telugu news, vikram lander