జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశం చేసిన అద్భుతమైన ఫీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభినందించారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించని మేరకే ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది.
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి సంబంధించి కీలక అప్డేట్ ను ఇస్రో ఎక్స్…
Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25…
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్…
ఇస్రో శాస్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకప్రకటన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కాకపోయినప్పటికీ ఆ ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని.. ఆ ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3…