Telangana : నిజమైన ప్రేమ అంటే ఇదే.. మొక్కకు పుట్టినరోజు వేడుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకను చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
2016 జూలై 29న వెంకటయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తాండూరు పట్టణంలోని తాము నివసిస్తున్న ఇంటి ముందు ఆమె ఓ మొక్క నాటారు.. ఇక అతను అనారోగ్యం కారణంగా ఇదేళ్ల క్రితం చనిపోయారు..తన భర్త బర్త్‌డే సందర్భంగా నాటిన మొక్కకు ఏటా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టును జేసీబీ సహాయంతో వేర్ల నుంచి పెకిలింపజేశారు. దాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాటారు. ఈసారి ఆ చెట్టుకే జన్మదిన వేడుకలు నిర్వహించి అన్నదానం చేశారు. విషయం తెలుసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆమెతో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది..
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, వారు గుర్తొచ్చిన ప్రతిక్షణం ఆ జ్ఞాపకాలు మన హృదయాన్ని కదిలిస్తుంటాయని చెప్పారు. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమని పేర్కొన్నారు. భర్త జ్ఞాపకాలను ఒక గుర్తుగానే మిగిలిపోనీయకుండా సమాజం బాగు కోసం ఆలోచించడం అరుదైన విషయమని విజయలక్ష్మిని అభినందించారు. ‘పది మంది బాగు కోసం బాధను కూడా పండుగలా మార్చడం, మొకను నాటి పెద్ద చేయటం.. మీ మానవత్వం సమాజంలోని మరింత మందికి ఆదర్శం’ అని ప్రశంసించారు.. ఆమెకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.. ప్రస్తుతం ఆమె మొక్కకు జరిపిన వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
Heartwarming scenes. #KotrikaVijayaLaxmi garu, a strong, determined lady searching for her lost husband amidst the tree he planted on his birthday as part of the #GreenIndiaChallenge initiative. Every year on his birthday, the family celebrates at this tree, showing their… pic.twitter.com/uLccrPcmx8
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 30, 2023
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!