మాజీ మంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మొదటి రోజు మీడియా సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు అని ఆరోపించారు. కోళ్ళ దాన కుంభకోణంలో 3 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు. అక్కడ వచ్చిన డబ్బులను వికారాబాద్ లో ఖర్చు చేస్తున్నాడని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఎంపీ ఉండడు.. ఎమ్మెల్యే ఉండడు.. వాళ్ల పెద్దసారే ఒప్పుకున్నాడు అని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Read Also: Asaduddin Owaisi: బాబ్రీ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది..
ఎన్నికల్లో గెలిస్తే సేవ చేస్తాం.. లేదంటే ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటామని కేసీఆర్ పలు సార్లు చెప్పుకొచ్చాడు అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత ఎక్కడ పండుకున్న రేవంత్ రెడ్డి వదలడు.. కేసీఆర్ తిన్న లక్ష కోట్లు కక్కిస్తాడు అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్ స్థానికత గురించి మాట్లాడుతుండు.. ఆయనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలువనట్లుంది.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు.. అలాగైతే ఆనంద్ కేరెళ్లిలో సర్పంచ్ గా పోటీ చేయాలే ఎమ్మెల్యేగా కాదు అని గడ్డం ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా విజయావకాశాలు ఉన్నాయి.. కాంగ్రెస్ పథకాలే అభ్యర్ధులను గెలిపిస్తాయి అని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తున్నాం.. వికారాబాద్ లో గెలుపు నాదే అని కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.