Vikarabad: బస్సు నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులు గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6363 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుంది. వికారాబాద్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరిన ఆర్టీసీ బస్సులో 90 మందికి పైగా ఉండగా, ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. రద్దీ దృష్ట్యా డ్రైవర్ బస్సును ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపేశాడు. అయితే అనంతపద్మనాభ స్వామి ఆలయం దాటిన తర్వాత ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఎండీ షాపి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని బస్సులోని వ్యక్తులకు చెబుతూనే బస్సును ముందుకు తోసాడు.
Read also: Prabhas: “రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్…
బస్సు అదుపు తప్పి బోల్తా పడకుండా పొదల్లోకి తీసుకుని వెళ్లాడు డ్రైవర్. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ చిన్నపాటి గాయాలు అయ్యాయి. దీంతో కొందరు ప్రయాణికులు 108కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటా హుటిని ఘటన స్థలికి చేరుకున్నారు. గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారు మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు. విషయం తెలుసుకున్న ధరూర్, వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. అయితే సంవత్సరం క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విధంగా బస్సు ప్రమాదం జరిగి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందిన సంఘటన మరువక ముందే ఆదే ప్రదేశంలో ఇప్పుడు మళ్లీ అదే ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగడం సంచలనంగా మారింది. అయితే ఈ సారి అదృష్టం కొద్దీ బస్సు బోల్తా పడక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..