వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నకిలీ క్లినిక్‌లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ఆరు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్, పల్లవి క్లినిక్ ల సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యా అర్హత లేకుండా ఎంబిబిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్.ఎం.ఎల్ యాక్ట్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి FIR తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఒక్కో క్లినిక్ లో 8 నుంచి 10 బెడ్లు వేసి క్లినిక్లు నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు.
CRIME: 7 నెలల గర్భంతో ఉన్న ప్రియురాలిని చంపేసిన సలీమ్..
తనిఖీ చేసిన ఐదు క్లినిక్ లకు DMHO పర్మిషన్, ఫార్మసీ పర్మిషన్ లేకుండా క్లినిక్ లు నడుపుతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బయో మెడికల్ వేస్టేజీ డిస్పోస్ చేయాలని, డిస్పోస్ చేయకుండా మున్సిపల్ వాహనంలో బయో మెడికల్ వేస్టేజ్ ని వేసి పంపిస్తున్నారన్నారు. ఐవి యాంటీబయాటిక్ వాడి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారని, నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యం అందిస్తున్న 300కు పైగా క్లినిక్లను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50 కి పైగా కేసులు నమోదు చేశామని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..